- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేపై ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్య విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ చీఫ్(Congress chief) మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆధ్యాత్మిక గురువు(Spiritual leader) జగద్గురు రాంభద్రాచార్య(Jagadguru Rambhadracharya) ఖర్గేపై మండిపడ్డారు. దేవుడి రంగు కాషాయమని, ఆ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ రాసి ఉంది..? కాషాయ పతాకంతోనే ఛత్రపతి శివాజీ దేశాన్ని మహారాష్ట్రని ఏకం చేశారు. సూట్లు, బూట్లు ధరించిన వారు దేశంలో రాజకీయాలు చేయవద్దు’’ అని అన్నారు.
ఖర్గే ఏమన్నారంటే?
‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అని యోగి చేసిన నినాదాన్ని ఉద్దేశిస్తూ ఖర్గే ఇటీవల విమర్శలు గుప్పించారు. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సోమవారం ముంబైలో అన్నారు. కాషాయం ధరించి ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యోగిపై మండిపడ్డారు. కాగా.. జగద్గురు రాంభద్రచార్య మాట్లాడుతూ.. యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని సమర్థించారు. మనం విడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్గాలు వేరైనప్పటికీ హిందువులు అంతా ఒక్కటే అని చెప్పారు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ హాని చేయలేరని, ఒక్క వేలు బలహీనంగా ఉన్నా, పిడికిలి బలంగా ఉంటుందని అన్నారు.