viral news: అభిమానిని ఫాలో చేసి మరి మాట్లాడిన ప్రముఖ క్రికెటర్..

by Indraja |
viral news: అభిమానిని ఫాలో చేసి మరి మాట్లాడిన ప్రముఖ క్రికెటర్..
X

దిశ డైనమిక్ బ్యూరో: సినిమా హీరోలకే కాదు క్రికెట్ బరిలో బ్యాట్, బాలు పెట్టె ఆటగాళ్లకు అదే రేంజ్ లో ఫాలోవర్స్ ఉంటారు. ఇక ఇష్టమైన క్రికెటర్ ని జీవితం లో ఒక్కసారైనా కలవాలని.. వాళ్ళతో మాట్లాడాలని మనలో చాలామందికి ఆశ ఉంటుంది. కొందరు వాళ్లకు నచ్చిన క్రికెటర్ ని కలవడానికి కూడా వెళ్తుంటారు. కానీ ఓ క్రికెటర్ మాత్రం తన అభిమాని బైక్ ను ఫాలో అయ్యి మరి అతని అభిమానితో మాట్లాడారు.

అతనే లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఆయన క్రికెట్ కు దూరమై 10 సంవత్సరాలు గడిచిన క్రికెట్ అభిమానుల్లో సచిన్ క్రజ్ మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది. అయితే తాజాగా సచిన్ తన స్నేహితుడుతో కలిసి కార్ లో వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై వెళ్తుండడం చూసారు.

కాగా ఆ వ్యక్తి ధరించిన జెర్సీ వెనుక ఐ మిస్ యు సచిన్ అని రాసి ఉండడం గమనించిన సచిన్ ఆ వ్యక్తి బైక్ ను ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్ళాక ఆ వ్యక్తి బైక్ ను క్రాస్ చేసిన సచిన్ తన కారును బైక్ ముందు ఆపి ఆ వ్యక్తితో మాట్లాడారు. సచిన్ ని చూసిన ఆ వ్యక్తి ఆనందం లో మునిగిపోయారు. అలానే తన చేతి పై ఉన్నసచిన్‌ టాటూని, లిటిల్ మాస్టర్‌కు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను అభిమాని తెందూల్కర్‌కి చూపించాడు.

అలానే తనతో మాట్లాడడానికి కార్ ఆపిన సచిన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన సచిన్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నందుకు ఆ అభిమానిని అభినందించారు. తాను కూడా ఎల్లప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొనే కార్ డ్రైవ్ చేస్తానని చెప్పారు. ఇక రోడ్డు పైన జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ను సచిన్ తన ట్విట్టర్ వేదిక ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Advertisement

Next Story