- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శభాష్ అరుణ్ గోయల్: మాజీ ఎన్నికల కమిషనర్‌పై మమతా బెనర్జీ ప్రశంసలు
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ఒత్తిడికి లొంగిపోనందుకు ఆయనను ప్రశంసించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓడిపోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ర్యాలీలో ఆమె ప్రసంగించారు. గోయల్ ఆకస్మిక రాజీనామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని తెలిపారు. బీజేపీ ఒత్తిడికి లొంగని అరుణ్ గోయల్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం అంటే ఏమిటో తేలిపోయిందని విమర్శించారు. బెంగాల్‌పై నిరాధార ఆరోపణలు చేసే ముందు ప్రధాని వాస్తవాలను అధికారులతో క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. మోడీ బెంగాల్‌లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మాత్రమే చేస్తున్నాడని, కానీ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. అలాగే 42 లోక్‌సభ స్థానాలకు గాను తన అభ్యర్థుల జాబితాను మమత ప్రకటించింది. బహరంపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను టీఎంసీ తరఫున బరిలోకి దింపింది.