Sabarimala: నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివస్తున్న భక్తులు

by Ramesh Goud |
Sabarimala: నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివస్తున్న భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: మకర సంక్రాంతి(Makara Sankranti) పండుగ సందర్భంగా శబరిమల(Sabarimala)కు అయ్యప్ప భక్తులు భారీగా తరలివస్తున్నారు. శబరిమలలో ప్రతీ ఏటా మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడు(Ponnambalamedu) కొండపై అయ్యప్ప స్వామి, భక్తులకు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం(Jyoti Darshan) కోసం అనేక రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాలదారులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు శబరిమల కొండకు క్యూ కట్టారు. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉన్నారు. శబరిమల మొత్తం స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి పాటలతో మారుమోగుతోంది. శబరిమల కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు మరో 5 వేల మంది పోలీసులు(Police) మోహరించారు. ఇవాళ సాయంత్రం మకర జ్యోతి దర్శనం ఉండటంతో తొక్కిసలాట ఘటనలకు తావు లేకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed