జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశ నీటి విడుదల..

by Sumithra |
జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశ నీటి విడుదల..
X

దిశ, తుంగతుర్తి : వారబందీ పద్ధతిలో సూర్యాపేట జిల్లాకు శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాలు కాలువల ద్వారా గురువారం తిరిగి విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అధికారులు ఉదయం 8 గంటలకు గేట్లను ఎత్తి తొలి విడతగా 500 క్యూసెక్కులను విడుదల చేశారు. అనంతరం సాయంత్రం వరకు నీటి సామర్థ్యాన్ని క్రమక్రమంగా పూర్తిస్థాయిలో పెంచుతామని ఆ శాఖ డీఈ సత్యనారాయణ “దిశ”కు తెలిపారు.

సూర్యాపేట జిల్లా వైపు ఎస్సారెస్పీ రెండో దశ జలాలు రావాలంటే బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయరే శరణ్యం. ఇందులో పూర్తిస్థాయిలో నీటి నిలువ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుతం పై నుండి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి 700 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. దీంతో బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 0.41 క్యూసెక్కుల నీటి నిల్వ ఉంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story