- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IND vs ENG T20 : భారత్ vs ఇంగ్లాండ్ టీ20 మూడో మ్యాచ్.. భారత్ టార్గెట్ 172

దిశ, వెబ్ డెస్క్ : భారత్ vs ఇంగ్లాండ్(IND vs ENG) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(T20 Series)లో భాగంగా మంగళవారం రాజ్‌కోట్ (Rajkot) లోని నిరంజన్ షా స్టేడియం(Niranjaj Shah stadium) లో మూడో మ్యాచ్ జరుగుతోంది. తొలుత భారత్ టాస్ గెలవగా.. టీంఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల పడగొట్టడంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. కీలక సమయంలో వరుణ్ వికెట్లు తీయడంతో బాట్స్‌మెన్‌లు పెవిలియన్ బాట పట్టారు. బెన్ డకెట్ (51), జోస్ బట్లర్(24), లియామ్ లివింగ్ స్టన్(43)లు రాణించారు. 24 బంతుల్లో 43 పరుగులు చేసిన లివింగ్ ఒక ఫోర్, ఐదు భారీ సిక్సర్లను బాది, స్టేడియాన్ని హోరెత్తించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ ఫిల్ స్టాల్(5) తక్కువ స్కోర్‌కే వెనుదిగాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, డకెట్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇంగ్లాండ్ 83 పరుగుల వద్ద బట్లర్ పెవిలియన్‌కు చేరాడు. 87 పరుగుల వద్ద బడెట్ అవుట్ అయ్యాడు. అయితే, బెన్ డటెన్ హాఫ్ సెంచరీతో అలరించారు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేశారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల బాదిన డకెట్.. చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ (5), హ్యారీ బ్రూక్ (8), జామీ స్మిత్ (6), ఓవర్టన్ (0), బ్రైడన్ కార్సీ (3), జోప్రా ఆర్చర్ (0) పరుగులకే అవుట్ కాగా.. చివరలో ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ చెరో పది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. చాలా రోజుల తర్వాత మ్యాచ్‌లో బరిలోకి దిగిన మహ్మద్ షమీకి వికెట్ దక్కలేదు. ఇక టీమిండియా జట్టు 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. సంజు శాంసన్ (3), అభిషేక్ శర్మ (24), సూర్యకుమార్ యాదవ్ (14) వద్ద అవుట్ కాగా.. 6 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. వర్మ, పాండ్య క్రీజులో ఉన్నారు.