- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పల్లీలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతుల డిమాండ్

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వేరుశనగకు కనీస మద్దతు ధర కావాలని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం సాయంత్రం రైతులు తిరగబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..ఖరీదు దారులతో కుమ్ముకై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా పాలకవర్గం చేస్తున్నారని,మార్కెట్ యార్డులో ఎన్నో మోసాలు జరుగుతున్నా చూసి చూడనట్లు పోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వందలాది రైతులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఓ సందర్భంలో రైతులు బస్ స్టాండ్ వైపు వెళ్ళి.. రోడ్డుపై ధర్నా కు యత్నించగా వారిని పోలీసులు సముదాయించి అటువైపుగా వెళ్ళకుండా నివారించారు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కు నిత్యం 30 నుంచి 50 వేల క్వింటాళ్ల పల్లీలు వస్తున్నా,అధికారులు 20 నుండి 25 వేల క్వింటాళ్ల పల్లీలు వస్తున్నాయని చూపిస్తున్నారని,అందుకు చైర్మెన్ పాలకవర్గానికి తెలియకుండా,గుట్టు చప్పుడు కాకుండా దిగుమతిదారులతో కమీషన్ మాట్లాడుకొని దండుకుంటున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. అసలు రైస్ మిల్లులు ఏ రోజు కూడా పాలకవర్గం తనిఖీలు నిర్వహించడంలేదని,టోల్ గేట్లు పెట్టి కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న ధాన్యాన్ని తనిఖీలు చేయమంటే పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆరోపించారు.