- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Attack on Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి ఇంట్లోవారి పనేనా?
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం(Attack on Saif Ali Khan) కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. సీసీటీవీ(CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి దీక్షిత్ గెదం మీడియాతో మాట్లాడారు.. సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరూ అనుమానాస్పదంగా కన్పించలేదన్నారు. అంతేకాకుండా, ఆ విజువల్స్ లో ఎవరూ బయటనుంచి లోపలికి వచ్చినట్లు సమాచారం లేదని అన్నారు. కాగా.. ఇంట్లో ఉన్నవారే ఈ దాడి చేసినట్లు తెలుస్తోందన్నారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ సొసైటీలో ఉన్నాడని అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌తో పాటు, అతని నివాసంలోని మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా ఆమ పరిస్థితి నిలకడగా ఉందన్నారు."తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడి జరిగిందని మాకు సమాచారం అందింది. వెంటనే, సీనియర్ అధికారులతో సహా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆయన లీలావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు" అని వెల్లడించారు.
రంగంలోకి దిగిన ఏడు బృందాలు
నిందితుడిని అరెస్టు చేయడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా.. దర్యాప్తు కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సైఫ్ పై దాడి జరిగిన తర్వాత, ముంబై పోలీసుల ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల వాంగ్మూలాలను కూడా ముంబై పోలీసులు రికార్డు చేస్తున్నారు. అయితే, దాడికి యత్నించారా లేదా అనే స్పష్టత మాత్రం రావాల్సి ఉంది. కాగా.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక డక్ట్ ఉందని, అది అతని బెడ్ రూమ్ లో తెరుచుకుంటుందని పోలీసువర్గాలు వెల్లడించాయి. నిందితుడు అక్కడి నుండే అతని ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ సిబ్బందిలోని ఐదుగురు సభ్యులను ముంబై పోలీసులు అదనపు వివరాల కోసం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Read More : సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. హెల్త్ బులిటిన్ విడుదల