క్రీడలతోనే యువతకు మానసిక ఉత్తేజం.. రాగి వేణు..

by Sumithra |
క్రీడలతోనే యువతకు మానసిక ఉత్తేజం.. రాగి వేణు..
X

దిశ, వనపర్తి ప్రతినిధి : యువత మానసిక ఉత్తేజం పొందటానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాగి వేణు అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణంలోని రాయిగడ్డలో మూడు రోజుల పాటు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. బుధవారం క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు. ఆసక్తి ఉన్న ప్రతి క్రీడలో యువత తన నైపుణ్యం ప్రదర్శించాలన్నారు. ఆటలు యువతకు మానసిక ఉల్లాసం ఇస్తుందన్నారు. క్రీడల పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా యువతలో క్రీడల్లో మెలుకువలను, నైపుణ్యాలను వెలికి తీయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి త్వరితగతిన నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. అనంతరం విన్నర్ కిషోర్, రన్నర్ బాలస్వామి జట్లకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాగి అశోక్, శివ, రాఘవేందర్ పాల్గొన్నారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed