Madagajaraja: ఈ సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు.. 12 ఏళ్ల తర్వాత రిలీజైన చిత్రంపై భారీ హైప్

by sudharani |
Madagajaraja: ఈ సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు.. 12 ఏళ్ల తర్వాత రిలీజైన చిత్రంపై భారీ హైప్
X

దిశ, సినిమా: విశాల్ (Vishal) రీసెంట్ సెన్సేషనల్ హిట్ చిత్రం ‘మదగజరాజా’ (Madagajaraja). వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), అంజలి (Anjali) హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీని సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహించాడు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, పండుగ సీజన్‌లో తమిళం (Tamil)లో నంబర్ వన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తెలుగు (Telugu)లో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న ‘మదగజరాజా’ తెలుగులో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ (Prerelease event) నిర్వహించింది.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా. ఇందులో చేసిన క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేశాను. విశాల్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తను చాలా ఫన్ పర్శన్. ఈ సినిమా తమిళ్‌లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్‌కి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థియేటర్స్‌లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఇది హీరోయిన్‌గా నా ఫస్ట్ కమర్షియల్ సినిమా. అంజలి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను అద్భుతమైన యాక్టర్. ఇందులో వెస్ట్రన్ హీరోయిన్‌గా కనిపించాను. ఇది మంచి ఎంటర్ టైనర్ చిత్రం. ప్రతి ఎపిసోడ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed