‘గేమ్ ఛేంజర్‌’ గురించి జూనియర్ NTR మాటల్లో?.. ఇద్దరి ఫ్యాన్స్ ఎమోషనల్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-28 15:09:59.0  )
‘గేమ్ ఛేంజర్‌’ గురించి జూనియర్ NTR మాటల్లో?.. ఇద్దరి ఫ్యాన్స్ ఎమోషనల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా(Game changer movie) సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో సినిమా కలెక్షన్ల వివరాలు కూడా చిత్రబృందం ప్రకటించడం ఆపేసింది. తొలిరోజు రూ.186 కోట్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ, ఆ తర్వాత కలెక్షన్ల వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు. మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ సినిమా, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అదరగొట్టినట్లు కలెక్షన్ల వివరాలు వెల్లడించారు.

ఈ క్రమంలో తెలుగు ఆడియెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Music Director Thaman) ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సినిమాను మనమే తగ్గించుకుంటున్నామని డాకు మహారాజ్(Daaku Maharaaj) సక్సెస్ మీట్‌లో గేమ్ ఛేంజర్‌(Game changer)ను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. ఇతర భాషల వారు మన సినిమాను గొప్పగా పొగుడుతుంటే.. మన సినిమాను మనమే తొక్కేసుకుంటున్నామని ఆవేదన చెందారు. ఒక మంచి సినిమా గురించి మాట్లాడేందుకు వెనుకాడుతున్నామంటే.. దానికి తెలుగు ఆడియన్సే కారణమని అన్నారు. ఈ క్రమంలో గతంలో గతంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను చరణ్, తారక్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. జైలవకుశ సినిమా ఫంక్షన్‌లో ఎన్టీఆర్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు.

‘ఏడాది, రెండేళ్ల పాటు కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అప్పుడు మా పరిస్థితి ఐసీయూలో ఉన్న వ్యక్తి కోసం బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. బతుకుతాడా? చస్తాడా? అనే టెన్షన్‌లో మాకు ఊపిరి కూడా ఆడదు. సినిమా మా సినిమా బాలేదని వీక్షించిన అభిమానులు చెబితే సుబ్బరంగా లైట్ తీసుకుంటాం. మరో సినిమాను బెటర్‌గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తాం. కానీ, మధ్యలో రివ్యూలు ఇస్తూ కొందరు పాతిపెట్టేస్తున్నారు. అభిమానుల్లో సినిమా చూడాలనే కోరికను కూడా చంపేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి తాము కష్టపడి చేసిన సినిమాను అభిమానుల వరకు చేరనివ్వండి. నచ్చలేదని.. వారు చెబితే తీసుకుంటాం. కానీ మధ్యలో రివ్యూల పేరిట సినిమాను చంపేయకండి’ అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను చరణ్, తారక్ ఇద్దరి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

సరిగ్గా గేమ్ ఛేంజర్ విషయంలో ఇదే జరిగిందంటూ ఇద్దరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. కాగా, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. కియారా అద్వానీ, అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), ఎస్‌జే సూర్యా, జయరామ్, సునీల్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

Next Story