Mahakumbh 2025: మహాకుంభమేళ రేంజ్‌ ఇది.. ఛాయ్‌, బిస్కెట్లతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందో తెలుసా?

by Vennela |   ( Updated:2025-01-16 07:02:36.0  )
Mahakumbh 2025: మహాకుంభమేళ రేంజ్‌ ఇది.. ఛాయ్‌, బిస్కెట్లతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: Kumbh Mela: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది 40కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడ భారీ ఎత్తున బిజినెస్ జరగనుంది. ఛాయ్ బిస్కెట్ల నుంచి ఆతిథ్యం వరకు పలు రంగాలకు భారీగా ఆదాయం సమకూరనుంది. బిస్కెట్లు, జ్యూస్, మీల్స్ ద్వారానే ఏకంగా రూ. 20వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఏ రంగంలో ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం.

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమ్మేళనం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా 45రోజుల పాటు కొనసాగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ మహాకుంభమేళాకు హాజరవుతున్నారు. ఈసారి 40కోట్ల మంది ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనాలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికతే కాదు..వ్యాపార పరంగానూ అతిపెద్ద కార్యక్రమంగానూ చెప్పవచ్చు. మహా కుంభమేళా ద్వారా ఈసారి రూ. 2లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. నెలరోజులకు పైగా జరిగే కార్యక్రమంతో స్థానిక వ్యాపార, పర్యాటక, ఉద్యోగరంగానికి కీలకంగా మారుతుంది.

మహాకుంభమేళాలో ఆర్థిక పరంగా చూస్తే ఆతిథ్య, పర్యాటక రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ట్రేడ్ బాడీ సీఏఐటీ తెలిపింది. స్థానిక హోటల్లు, గెస్ట్ హౌసులు, తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈ సారి ఏకంగా రూ. 40 వేల కోట్లు బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహాకుంభ్ పెద్దెతున ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది. మతపరమైన ప్రయాణాల సమయాల్లో ఒక్కో వ్యక్తికి సగటున రూ. 5వేల ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు రూ. 2లక్షల కోట్లు దాటుతుందని ఒక అంచనా. దీనిలో హోటళ్లు , గెస్ట్ హౌసులు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఖర్చు ఉంటుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

కుంభమేళాలో ఆహారం, పానీయాల రంగం కీలకంగా మారనుందని సీఏఐటీ తెలిపింది. ప్యాకేజ్డ్ ఫుడ్, నీళ్లు, ఛాయ్ బిస్కెట్లు, ఫ్రూట్ జ్యూస్, మీల్స్ వంటి వాటితోనే ఈసారి రూ.20వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక వస్తువులైన నూనె, దీపాలు, గంగా వాటర్, దేవుడి విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో రూ. 20వేల కోట్ల వ్యాపారాం అంచనా వేసింది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed