ఆ పోలీసులు మళ్లీ అన్యాయానికి గురికావాల్సిందేనా..

by Sumithra |
ఆ పోలీసులు మళ్లీ అన్యాయానికి గురికావాల్సిందేనా..
X

దిశ, లోకేశ్వరం : గతంలో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందేందుకు 32 ఏళ్లకు పైగా ఎదురుచూసిన బాసర జోన్ లో పనిచేస్తున్న పోలీసులు మళ్లీ అన్యాయానికి గురి అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వారితో పాటు ఉద్యోగంలో చేరి ఇతర జోన్ లలో పనిచేస్తున్న పోలీసులు ప్రస్తుతం ఏఎస్ఐలుగా పదోన్నతి పొంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా వారికి సంక్రాంతి కానుకగా ఎస్సైలుగా పదోన్నతి కల్పించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే.

కానీ వారితో పాటు ఉద్యోగంలో చేరి బాసర జోన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్ళు ఇంకా కనీసం ఏఎస్ఐలు కూడా కాలేకపోయారు. కనీసం వారి సీనియారిటీ లిస్టు కూడా తయారు కాలేదంటే వారు ఏ మేరకు అన్యాయానికి గురవుతున్నారో అధికారులు ఆలోచించాల్సి ఉంది. ఇకనైనా 2024 - 2025 సంవత్సరం హెడ్ కానిస్టేబుల్ - ఏఎస్ఐ సీనియారిటీ లిస్ట్ తయారుచేస్తే వారి సీరియల్ నంబర్ ఎంత ఉందో అవగాహన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వారి మనోవేదనను గుర్తించి ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed