S 400 : శత్రు లక్ష్యాల భరతంపట్టిన ‘సుదర్శన్ ఎస్-400’

by Hajipasha |
S 400 : శత్రు లక్ష్యాల భరతంపట్టిన ‘సుదర్శన్ ఎస్-400’
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా నుంచి కొనుగోలు చేసిన ‘సుదర్శన్ ఎస్-400’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థతో భారత వాయుసేన నిర్వహించిన ప్రయోగ పరీక్ష సక్సెస్ అయింది. శత్రు యుద్ద విమానాలను(నమూనాలు) ఈ వ్యవస్థ 80 శాతం కచ్చితత్వంతో ఛేదించింది. ‘సుదర్శన్ ఎస్-400’ వ్యవస్థ సంధించిన క్షిపణుల వర్షాన్ని దాటుకొని శత్రు యుద్ధ విమానాలు(నమూనాలు) గగనతలంలో ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడిందని వాయుసేన తెలిపింది.

రూ.35వేల కోట్లతో ఐదు స్క్వాడ్రన్ల ‘సుదర్శన్ ఎస్-400’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం రష్యాకు భారత్ ఆర్డర్ ఇవ్వగా.. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు వచ్చాయి. ప్రస్తుతం వాటిని పాక్, చైనా సరిహద్దుల్లో చెరో 1.5 స్క్వాడ్రన్లు చొప్పున మోహరించారు. మరో రెండు స్క్వాడ్రన్లను 2026 సంవత్సరంలో భారత్‌కు రష్యా సరఫరా చేయనుంది.



Next Story

Most Viewed