Russia: డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఆరుగురు పౌరులు మృతి

by vinod kumar |
Russia: డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఆరుగురు పౌరులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర స్థాయికి చేరుకుంది. ఇటీవల రష్యా రాజధాని మాస్కో (Mascow) లక్ష్యంగా ఉక్రెయిన్ దాడి చేయగా.. దానికి బదులుగా సోమవారం ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. డ్రోన్లు (Drones), బాలిస్టిక్ క్షిపణుల(Balistic missiles)తో తూర్పు ఉక్రెయిన్ పై అటాక్ చేసింది. ఈ ఘటనల్లో ఆరుగురు కీవ్ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పలు నగరాలపై రష్యా గైడ్ బాంబులను కూడా ప్రయోగించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) తీవ్రంగా స్పందించారు. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల రష్యా తన దాడులను తీవ్రతరం చేసిందని తెలిపారు. ఉక్రేనియన్లను భయపెట్టడానికే ఈ చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. యుద్ధం1,000-రోజుల మైలురాయికి చేరువవుతున్న సందర్భంగా ఘర్షణను మరింత కొనసాగించడానికే వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతీ రోజూ రాత్రి రష్యా దాడులకు తెగపడుతోందని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed