Russia: ఉక్రెయిన్ పై డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

by Shamantha N |
Russia: ఉక్రెయిన్ పై డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లతో రష్యాపైకి విరుచుకుపడింది. కాగా.. సోమవారం తెల్లవారుజామున రష్యా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. డ్రోన్లు, క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో భీకర దాడి చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలను లక్ష్యాలుగా చేసుకున్నట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది. కీవ్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. నివాసితులను బాంబు షెల్టర్లలోకి పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. కీవ్‌లోని హోలోసివ్‌స్కీ, సోలోమియన్‌స్కీ జిల్లాల్లో అత్యవసర సేవలు ప్రారంభించారు. ఈ విషయాన్ని కైవ్ మేయర్ విటాలి క్లిట్‌ష్కో తెలిపారు. రష్యా చేస్తున్న దాడుల వల్ల షెవ్ చెంకివ్ స్కీ జిల్లాలో ఒకరు తీవ్రంగా గాయపిడనట్లు వెల్లడించారు. ‘‘ప్రతిదానికీ సమాధానం ఉంటుంది. శత్రువులు దాన్ని ఎదుర్కొని తీరతారు’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్

శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్‌ (Ukraine) రష్యాపై 158 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిని రష్యా (Russia) కూల్చి వేసింది. మాస్కోలోని రెండు ప్రాంతాల్లో 9 చోట్లు దాడులు జరిగాయి. అయితే, ఈ దాడల్లో ఎలాంటి ప్రాణనష్టం జరలేదని రష్యా అధికారులు తెలిపారు. కస్క్‌ ప్రాంతంలో 46 డ్రోన్ల దాడులు జరిగాయి. బ్రియాన్స్క్‌లో 34, వోరోనెజ్‌లో 28, బెల్గోరోడ్‌లో 14 డ్రోన్లతో దాడులు జరిగాయి. ఇవన్నీ ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలే. వీటితోపాటు రష్యా లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. అందులో మాస్కోకు సమీపంలోని త్వెర్, ఇవానోవో ప్రాంతాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed