బీజేపీ పేలవ ఫలితాలకు ఎన్‌సీపీతో పొత్తే కారణం.. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆరోపణలు

by S Gopi |   ( Updated:2024-07-17 17:07:40.0  )
బీజేపీ పేలవ ఫలితాలకు ఎన్‌సీపీతో పొత్తే కారణం.. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఫలితాలు ఎన్డీఏ కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా మిగిలింది. ముఖ్యంగా బీజేపీకి కీలక రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్రాల్లో సీట్లు తగ్గడం వల్ల మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ పేలవమైన ఫలితాలకు అజిత్ పవార్ ఎన్‌సీపీ పార్టీయే కారణమని ఆర్ఎస్ఎస్ మరాఠీ వారపత్రిక 'వివేక్' కథనం పేర్కొంది. ఆర్ఎస్ఎస్‌కు చెందిన రతన్ శారదా రాసిన కథనంలో.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండె శివసేనతో సహజమైన పొత్తుగా ప్రజలు భావించారని, కానీ, అజిత్ పవార్ ఎన్సీపీతో కలవడం రుచించలేదు. ప్రతి కార్యకర్త ఎన్నికల్లో వైఫల్యంపై మాట్లాడుకుంటున్నారని, ఎన్సీపీతో పొత్తుపై అసంతృప్తిని వ్యక్తపరిచారని, బీజేపీ కార్యకర్తలు ఎన్సీపీతో కలవడం ఇష్టపడలేదనేది స్పష్టమైందని పేర్కొన్నారు. దీనికి ముందు ఆర్ఎస్ఎస్‌కి చెందిన మరో మ్యాగజైన్ ‘ ఆర్గనైజన్’లో సైతం లోక్‌సభ ఎన్నికల్లో అతివిశ్వాసం బీజేపీని దెబ్బతీసిందని, బీజేపీ నేతలు-కార్యకర్తలు వాస్తవాలను సరిచూసుకోవాలని సూచించింది. వరుసగా బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్‌ అభిప్రాయాలను ప్రచురించడం చర్చనీయాంశమైంది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం షిండె, అజిత్ పవార్‌లతో బీజేపీ సీట్ల పంపకాలపై కసరత్తు చేస్తున్న తరుణంలో ఈ కథనాలు రావడం గమనార్హం.

Advertisement

Next Story