cyber fraud case:సైబర్ మోసం కేసులో చైనీయుడు అరెస్టు

by Shamantha N |
cyber fraud case:సైబర్ మోసం కేసులో చైనీయుడు అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ మోసం(cyber fraud case) కేసులో చైనీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 45.5 లక్షల సైబర్ మోసం కేసుపై ఫాంగా చెంజిన్ అనే చైనీయిడుని(Chinese national) షహదారా సైబర్ పోలీసులు(Shahdara Cyber Police) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి పలు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా కుంభకోణాలతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసాలకు(stock trading scams) పాల్పడినట్లు వెల్లడించారు. జూలైలో సురేష్ కొలిచియిల్ అచ్యుతన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టాక్ మార్కెట్ శిక్షణా సెషన్ల పేరుతో మోసపూరిత పథకాలలో రూ. 43.5 లక్షలు పెట్టుబడి పెట్టడానికి మోసపోయారని ఆరోపించాడు. నిందితుల నియంత్రణలో ఉన్న పలు బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విచారణలో సంచలనాలు బయటకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఉత్తరప్రదేశ్‌లలో(Uttar Pradesh) సైబర్ క్రైమ్, మనీలాండరింగ్ కు సంబంధించిన మరో రెండు కేసులతో చెంజిన్‌ సంబంధం ఉన్నట్లు గుర్తించింది. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన 17 అదనపు ఫిర్యాదులను కూడా పోలీసులు కనుగొన్నారు. అవన్నీ ఒకే ఫిన్‌కేర్ బ్యాంక్ ఖాతాతో ముడిపడి ఉన్నట్లు వెల్లడించారు.

మోసపూరిత లావాదేవీల ద్వారా..

ఢిల్లీలోని ముండ్కాలో మహాలక్ష్మి ట్రేడర్స్ కింద రిజిస్టర్ అయిన బ్యాంకు ఖాతాలో నిధులను పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌లో రూ. 1.25 లక్షల బదిలీతో సహా పలు మోసపూరిత లావాదేవీలు ఈ అకౌంట్ ద్వారా జరిగినట్లు తెలిపారు. కాల్ రికార్డులు, బ్యాంకింగ్ డేటా సాంకేతిక విశ్లేషణ ద్వారా సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న చెంజిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, వాట్సప్ చాట్ లాగ్ లతో సహా పలు డిటైల్స ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed