బైక్ పై యువ జంట రొమాన్స్.. అదే జంటతో మరో వీడియో చేయించిన పోలీసులు!

by Ramesh Goud |
బైక్ పై యువ జంట రొమాన్స్.. అదే జంటతో మరో వీడియో చేయించిన పోలీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాజస్థాన్ లో బైక్ పై రోమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంటను పోలీసులు పిలిచి మరో వీడియో చేయించారు.రాజస్థాన్ లోని కోటాలో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో నడిరోడ్డుపై బైక్ మీద వెళుతూ ఓ యువ జంట రోమాన్స్ చేసింది. దీనికి సంబందించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతూ.. ఆ యువ జంట చేస్తున్న అసభ్యకరమైన పనిపై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వీడియో ఉన్న బైక్ నంబర్ ట్రేస్ చేసి ఆ యువ జంటను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీడియోలో వ్యక్తి కైతూన్ కు చెందిన వాసీం అని, అతడు బైక్ నడుపుతున్న సమయంలో బైక్ ఉన్న మహిళ ఢిల్లీకి చెందిన రిజ్వానా అని, వీరిద్దరూ ప్రస్తుతం లివ్ ఇన్ లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో వారితో చెవులు పట్టించి క్షమాపణలు చెబుతూ ఓ వీడియో తీయించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయించగా ప్రస్తుతం ఇది కూడా వైరల్ గా మారింది.

Advertisement

Next Story