అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి

by samatah |
అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన మహిళ మృతి చెందింది. ఈ విషయాన్ని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ మహిళ, యువ ప్రొఫెషనల్ అర్షియా జోషి(21) మరణించింది. వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ఎక్స్‌లో పేర్కొంది. జోషి మృత దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయం చేస్తామని, ఆమె కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపింది. విదేశాల్లో నివసించే ప్రజలకు సహాయం చేసే టీమ్ ఎయిడ్ అనే స్వచ్చంద సంస్థ కూడా జోషి భౌతిక కాయాన్ని భారత్‌కు పంపండంలో సహాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన జోషి గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అమెరికాలో ఇటీవల భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సుమారు తొమ్మిది మంది విద్యార్థులు ఈ దాడుల వల్ల మరణించారు.

Advertisement

Next Story

Most Viewed