బెంగాల్, గుజరాత్‌లో నవమి వేడుకల్లో ఘర్షణలు..

by Vinod kumar |
బెంగాల్, గుజరాత్‌లో నవమి వేడుకల్లో ఘర్షణలు..
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. శోభయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల దాడి చోటుచేసుకుంది. బెంగాల్ హౌరాలో రెండు గ్రూపులో మధ్య చోటుచేసుకున్న వివాదంలో చిచ్చు రేగింది. ఈ ఘర్షణల్లో పలు వాహానాలకు నిప్పటించిన వీడియోలు వైరల్‌గా మారాయి. బెంగాల్ హింస ఘటనపై సీఎం మమతా స్పందించారు. అల్లర్లే దేశానికి శత్రువని అన్నారు.

మీరు చేసే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిరసనకారులను మమతా హెచ్చరించారు. మరోవైపు గుజరాత్ వడోదరాలోనూ శోభయాత్ర ఊరేగింపులో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొందరు వ్యక్తులు యాత్ర చేస్తున్న వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

Next Story