RG Kar Rape Case : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. ఆ ఇద్దరికి బెయిల్స్

by Hajipasha |
RG Kar Rape Case : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. ఆ ఇద్దరికి బెయిల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన(RG Kar Rape Case) యావత్ దేశంలో కలకలం రేపింది. ఈ కేసులో అరెస్టయిన కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్(Sandip Ghosh), కోల్‌కతాలోని తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇంఛార్జి ఆఫీసర్ అభిజిత్ మోండల్‌(Abhijit Mondol)లకు బెయిల్ మంజూరైంది. శుక్రవారం కోల్‌కతాలోని సియెల్దా కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

రూల్స్ ప్రకారం 90 రోజుల్లోగా ఈ ఇద్దరిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. చెరో రూ.2వేల ష్యూరిటీ బాండ్లను సమర్పించి వారిద్దరూ బెయిల్‌పై విడుదల కావచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఈక్రమంలో సీబీఐ విచారణకు పిలిస్తే వెళ్లి సహకరించాలని సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్‌లకు నిర్దేశించింది. బెయిల్ మంజూరైనప్పటికీ.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోష్ జైలులోనే ఉండనున్నారు.

Advertisement

Next Story