- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Junior Doctors : జూనియర్ డాక్టర్లపై పోలీసుల దాడి.. వైద్యుల సంఘం వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ కోల్‌కతా పరిధిలోని ధర్మతాల ఏరియా వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా తమపై కొందరు పోలీసులు దాడికి పాల్పడ్డారని ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఆ ఏరియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు తాము ముందుగానే అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
అయినా తమపై దాడి చేసినందుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. లేదంటే ధర్మతాల ఏరియాలోనే నిరసనను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. ‘‘జూనియర్ డాక్టర్లపై పశ్చిమ బెంగాల్ పోలీసుల దాడి’’ అనే క్యాప్షన్‌తో బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవ్య ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. బెంగాల్‌లో దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.