సౌదీ ప్రిన్స్ కు మోడీ రిక్వెస్ట్.. ఏంటంటే?

by Shamantha N |
సౌదీ ప్రిన్స్ కు మోడీ రిక్వెస్ట్.. ఏంటంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: హజ్ యాత్రపై ప్రధాని మోడీ కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ముస్లిం సోదరులు, సోదరీమణుల కోసం బీజేపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుందన్నారు. సౌదీ అరేబియా హజ్ కోటాను పెంచడాన్ని ప్రస్తావించారు మోడీ. హజ్ కోటాను పెంచాలని సౌదీ ప్రిన్స్ ను తాను కోరారని తెలిపారు మోడీ. దీంతో, వెంటనే సౌదీ ప్రిన్స్ హజ్ కోటాను పెంచినట్లు వివరించారు. హజ్ వెళ్లాలనుకున్న ముస్లిం యాత్రికులకు వీసా ప్రక్రియ నియమాలను కూడా సులభతరం చేశారని తెలిపారు.

గతంలో, హజ్ కోటా తక్కువగా ఉండేందని.. దాంతో తగాదాలు జరిగేవని పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు లంచాలు ఇచ్చేవారని.. పలుకుబడి ఉన్నవారికి మాత్రమే యాత్రకు వెళ్లే ఛాన్స్ ఉండేదని చెప్పుకొచ్చారు. హజ్ కోటా పెంచమని సౌదీ ప్రిన్స్ కు తాను రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు మోడీ. హజ్‌కు వెళ్లాలనుకునే వేలాది మంది సోదరీమణుల కలలను కూడా తమ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. గతంలో ముస్లిం మహిళలు హజ్ యాత్రకు ఒంటరిగా వెళ్లేవారు కాదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మెహ్రం లేకుండా హజ్ కోసం వెళ్లేందుకు మహిళలకు అనుమతి ఇచ్చిందన్నారు.

2019 లో హజ్ కోటాను 2 లక్షలకు పెంచుతున్నట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మోడీ అభ్యర్థన మేరకే యాత్రికుల కోటా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఈఏడాది జనవరిలో సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక హజ్ ఒప్పందం కుదుర్చుకుంది భారత్.

ఇకపోతే, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్, మీరట్, బాగ్‌పట్, ఘజియాబాద్, అలీఘర్, మధుర, బులంద్‌షహర్ స్థానాలతో పాటు అలీగఢ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 26న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed