- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతీయ జెండాల వినియోగంపై సర్క్యులర్ జారీ చేసిన హోం మంత్రిత్వ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండాల వినియోగంపై సర్క్యులర్‌ను జారీ చేసింది. జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో వాడే కాగితపు జెండాలను ఆ తర్వాత నేలపై పడేయడం లాంటి చర్యలను నివారించాలని సూచించింది. భారత జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని, జెండా గౌరవానికి అనుగుణంగా కాగితపు త్రివర్ణ పతాకాలను గౌరవంగా డిస్పోజ్ చేయాలని కోరింది. ఈ విషయంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పార్ట్-ఈఈ పేరా 2.2లోని క్లాజ్ ప్రకారం ఈ సర్క్యులర్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26న, భారత్ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఢిల్లీలో జరిగే పరేడ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా సరిహద్దు భద్రతా దళం మహిళా సైనిక బృందం కవాతు చేయనుంది. 144 మంది బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారిణి నేతృత్వం వహించనున్నారు.