- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ ప్రసంగంలోని వ్యాఖ్యల తొలగింపు.. స్పీకర్ నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: సోమవారం లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై తీవ్ర దుమారం రేగిన విషయం విధితమే. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధ తీర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పై పలు విమర్శలు చేస్తూ ప్రసంగాన్ని గంట 40 నిమిషాల పాటు కొనసాగించారు. ఇందులో బీజేపీ మైనారిటీలను వివక్షపూరితంగా చూస్తోందని, అగ్నివీర్ పథకాన్ని భారత సైన్యం కోసం కాదని, పీఎంవో ప్రణాళికగా అభివర్ణించారు.
అలాగే అదానీ, అంబానీలపై, నీట్ పరీక్షకు సంబందించిన ఆరోపణలు చేశారు. వీటిపై చర్యలు తీసుకున్న స్పీకర్ ఓంబిర్లా.. పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ఇక రాహుల్ గాంధీ హిందువుల గురించి ప్రస్తావస్తూ.. మోడీ, ఆర్ఎస్ఎస్ లపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. హిందువులు హింసను ప్రోత్సహించరు అని చెబుతూ.. తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు 24 గంటలూ హింస, ద్వేషాలకు పాల్పడుతున్నారని, బీజేపీ మొత్తం హిందు సమాజం కాదని, ఆర్ఎస్ఎస్ మొత్తం హిందు సమాజం కాదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై లోక్ సభలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై మోడీ సహా ఎన్డీఏ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేగాక రాహల్ గాంధీ కొన్ని మతపరమైన ఫోటోలను లోక్ సభలో ప్రదర్శించడంపై కూడా అధికార ఎన్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు వర్తించవని స్పీకర్ రాహుల్ గాంధీని వారించారు. ఈ వివాదానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.