ఆశిశ్ మిశ్రాకు ఊరట: ఆ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపు

by samatah |
ఆశిశ్ మిశ్రాకు ఊరట: ఆ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. జస్టిస్ సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పురోగతిపై ట్రయల్ కోర్టు నివేదికను పొందాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించి.. విచారణను వాయిదా వేసింది. గతేడాది సెప్టెంబర్ 26న అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి, అతని కుమార్తె చికిత్స కోసం మిశ్రా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) ను సందర్శించడానికి వీలుగా మిశ్రా బెయిల్ షరతులను సుప్రీంకోర్టు సడలించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో రైతులు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా యూపీలోని లఖింఖేరిలో రైతులు ధర్నా చేస్తుండగా ఆశిశ్ మిశ్రా వాహనం వారిని ఢీకొనడంతో నలుగురు రైతులతో సహా 8 మంది మరణించారు. దీంతో ఆశిశ్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా..విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed