రష్యా సైన్యం నుండి 45 మంది భారతీయుల విడుదల

by M.Rajitha |
రష్యా సైన్యం నుండి 45 మంది భారతీయుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా సైన్యం వద్ద అనుకోకుండా చిక్కుకుపోయిన 45 మంది భారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయినపుడు అనుకోని పరిస్థితుల్లో కొంతమంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో సైన్యం వద్ద చిక్కుకున్న వారిలో 45 మందిని విడుదల చేస్తున్నట్టు బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 50 మందిని కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.

కానీ అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనాలు మరోలా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల ఆశ చూపించి భారత్ నుండి కొంతమంది యువకులను రష్యాకు తీసుకువెళ్ళి, వారిని బలవంతంగా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్దంలోకి దింపారని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. వీరిలో నలుగురు యుద్దం చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ రష్యా అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక కొంతమందిని భారత్ కు పంపించారు. ఇపుడు మరో 45 మందిని కూడా రష్యా విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed