వివాహ వేడుకలో 'రసగుల్లా' తిన్న బంధువుల ఆరోగ్యం 'గుల్ల'

by Anjali |   ( Updated:2023-05-25 03:44:52.0  )
వివాహ వేడుకలో రసగుల్లా తిన్న బంధువుల ఆరోగ్యం గుల్ల
X

దిశ, వెబ్‌డెస్క్: స్వీట్ అనగానే ఎవ్వరికైనా సరే నోరూరాల్సిందే. అందులో ఇంకా రసగుల్లా అంటే మనసు పులకరిస్తుంది. అయితే ఓ పెళ్లి కార్యక్రమంలో ఈ రసగుల్లాని తిని 70 మంది ఆనారోగ్యానికి గురైన ఘటన ఉత్తర భారతదేశంలో చోటుచేసుకుంది. అక్కడ ఏ ప్రొగ్రామ్ జరిగిన స్వీట్ తప్పకుండా ఉండాల్సిందేనట. కాగా కన్నౌజ్‌లోని మధర్‌పూర్ గ్రామంలో బుధవారం ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుక విందులో భాగంగా రసగుల్లాను ఏర్పాటు చేశారు. ఆ స్వీట్ తిన్న పలువురు చిన్నారులతో పాటు దాదాపు 70 మంది ఫుడ్‌పాయిజనింగ్‌కు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇర్ఫాన్ ఖాన్ (48), షాజియా (7), రియాజుద్దీన్ (55), అర్జూ (1), అజ్రా (5), షిఫా (4), యూసుఫ్ (2), సుల్తాన్ (52) ఇంకా చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించామని జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శక్తి బసు తెలిపారు.

Advertisement

Next Story