- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ, పంజాబ్‌లలో రెడ్ అలర్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం 3.9డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన విషయం తెలిసిందే. దీంతో దట్టమైన పొగమంచు కారణంగా చలిగాలులు వీస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మరో 3 రోజులు కొనసాగే చాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో శనివారం రెడ్ అలర్ట్, ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఈనెల 15వరకు చలిగాలులు తగ్గే అవకాశం లేదని వెల్లడించింది. ‘పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో చాలా చోట్ల, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాజస్థాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ‘తీవ్రమైప పొగమంచు ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాలను చుట్టుముట్టింది. దీంతో రైలు, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరో మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది’ అని పేర్కొంది. మరోవైపు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో చలిగాలుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.