7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కొవిడ్ కేసులు

by samatah |
7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కొవిడ్ కేసులు
X

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 841 మంది వైరస్ బారిన పడ్డారు. దాదాపు 227 రోజులు(7నెలల) తర్వాత అత్యధికంగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309 కు చేరింది. వైరస్ కారణంగా తాజాగా.. కేరళ, కర్ణాటక, బిహార్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. డిసెంబర్ 5వరకు రోజు వారీగా కేసుల సంఖ్య తగ్గింది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కేసులు క్రమంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త వేరియంట్ జేఎన్‌-1కు సంబంధించినవి ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో 178 కేసులు వెలుగు చూశాయి. గోవాలో అత్యధికంగా 47 కేసులు రాగా.. కేరళలో 41 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ భారత్‌లో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. మరోవైపు, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story