NDA భేటీలో ఆసక్తికర పరిణామం.. ప్రధాని కాళ్లు మొక్కేందుకు ట్రై చేసిన నితీష్ కుమార్

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-07 08:52:48.0  )
NDA భేటీలో ఆసక్తికర పరిణామం.. ప్రధాని కాళ్లు మొక్కేందుకు ట్రై చేసిన నితీష్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్డీయేలో కీలక భాగస్వాములుగా ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు అలయెన్స్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఢిల్లీ పాత పార్లమెంట్ భవనంలో శుక్రవారం జరిగిన ఎన్డీయే భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు తమ మద్దతును మోడీకి తెలిపే సమయంలో మాట్లాడారు. ఇదే సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీ మద్దతు తెలిపిన అనంతరం ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఆ సమయంలో నితీష్ కుమార్ మోడీ కాళ్లు మొక్కేందుకు ట్రై చేశారు. కాగా, మోడీ నితీష్‌ను వారించి కరాచలనం చేశారు. ఆ సమయంలో నితీష్ ప్రధాన మోడీ రెండు చేతులకు శిరస్సు వంచి నమస్కరించారు. ప్రస్తుతం ఈ రేర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story