- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranya Rao: డీఆర్ఐ అధికారులపై నటి రన్యారావు సంచలన ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు కస్టడీలో హింసకు గురవుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు కస్టడీలో తనని హింసించినట్లు వెల్లడించారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారని, ఆహారం కూడా ఇవ్వలేదని, తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కు ఆమె లేఖ రాశారు. తనను తప్పుడు కేసులో ఇరికించినట్లు లేఖలో పేర్కొన్నారు. రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో ఈనెల 3న పట్టుబడింది. అయితే, ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తాను ఏతప్పూ చేయలేదని.. తప్పుడు కేసులో ఇరికించారంటూ పేర్కొన్నారు. తనను విమానంలోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఇక కస్టడీలో తనపై అధికారులు పదేపదే దాడులు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ అయినప్పట్నుంచి కోర్టులో హాజరుపరిచే వరకూ అధికారులు నాపై శారీరకంగా దాడి చేశారు. 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. డీఆర్‌ఐ అధికారులు తయారు చేసిన స్టేట్‌మెంట్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. 40 ఖాళీ పేపర్లపై, 50-60 తెల్లకాగితాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. పదేపదే దాడి చేసినప్పటికీ సంతకాలు చేసేందుకు నేను నిరాకరించా. కానీ, బలవంతంగా నాతో సంతకాలు చేయించుకున్నారు. వారు చెప్పినట్లు వినకపోతే.. నా తండ్రి గుర్తింపుని బహిర్గతం చేస్తామన్నారు. మార్చి 3న సాయంత్రం 6:45 గంటల నుంచి మార్చి 4న సాయంత్రం 7:50 గంటల వరకూ నన్ను నిర్బంధంలో ఉంచారు. అప్పుడు నిద్రపోడానికి కూడా అనుమతించలేదు. ఆహారం కూడా నిరాకరించారు’ అని రన్యారావు లేఖలో ఆరోపించారు.
కేసుతో సంబధం లేదని వెల్లడి..
అంతేకాదు, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రన్యారావు పేర్కొన్నారు. తన నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ కేసులోని ఇతర అనుమానితులను రక్షించేందుకు తనను తప్పుడు కేసులో ఇరికించారని రన్యారావు ఆరోపించారు. ఇక ఈ కేసులో తన సవతి తండ్రి ప్రమేయం లేదని రన్యారావు లేఖలో స్పష్టం చేశారు. అయితే, మార్చి 7న డీఆర్‌ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు వాదన మరోలా ఉంది. అప్పుడు తాను బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు నటి ఒప్పుకుంది. ఆమె నుంచి 17 గోల్డ్ బిస్కిట్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మార్చి 10న కోర్టు ఎదుట హాజరు పరచగా.. తనపై దాడి జరగలేదని.. కానీ మానసికంగా హింసించారని ఆరోపించింది. డీఆర్‌ఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు తనను మాటలతో దుర్భాషలాడుతున్నారని నటి పేర్కొన్నారు. తన వద్ద నుంచి 17 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఆ తర్వాత మార్చి 10న రన్యా రావు కోర్టులో హాజరుపరచగా.. తనపై ఎలాంటి దాడీ జరగలేదని పేర్కొంది. ‘వారు నన్ను కొట్టలేదు, కానీ మాటలతో తీవ్రంగా దుర్భాషలాడారు. అది నాకు తీవ్ర మానసిక క్షోభ కలిగించింది’ అని రన్యారావు న్యాయమూర్తి ముందు వాపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం మాట మార్చడం గమనార్హం.
READ MORE ...
Betting Apps: సుప్రీత చేసింది.. రైటా రాంగా..?.. ఆమె చేసింది ఎంత వరకు కరెక్ట్..?
శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు