- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand: చంపై సోరెన్ స్థానంలో మంత్రివర్గంలోకి రాందాస్ సోరెన్
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోకి మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ స్థానంలో కొత్తగా ఘట్‌శిల ఎమ్మెల్యే రాందాస్ సోరెన్‌ను తీసుకున్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాందాస్ సోరెన్‌తో మంత్రిగా గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జేఎంఎం నేతృత్వంలోని కూటమి సీనియర్ నేతలు, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పార్టీపై అసహనంతో ఇటీవల చంపై సోరెన్ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాందాస్ సోరెన్ రాష్ట్ర కేబినెట్‌లోకి 12వ మంత్రిగా ప్రవేశించారు. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘట్‌శిలా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాందాస్, కొల్హాన్ డివిజన్ నుండి సంతాల్ గిరిజన సంఘం తరపున చంపై సోరెన్ స్థానంలో మరో నాయకుడిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం జంషెడ్‌పూర్‌లో జేఎంఎం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే చంపై సోరెన్ ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇటీవల హేమంత్‌కు బెయిల్ లభించడంతో చంపై సోరెన్ తన పదవి నుంచి వైదొలగగా, తనను బలవంతంగా తొలగించారని, పార్టీ విధి విధానాలను తప్పుబడుతూ, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.