రామమందిర నిర్మాణంపై కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు

by S Gopi |
రామమందిర నిర్మాణంపై కర్ణాటక మంత్రి కీలక వ్యాఖ్యలు
X

బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకే పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం జరుగుతోందని, ఇది కేవలం ఒక రాజకీయ స్టంట్ అని కర్ణాటక మంత్రి డి సుధాకర్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, రాముడి ఆలయ ప్రాజెక్టును ప్రదర్శించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాల గురించి సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల దృష్టిని మరల్చడానికేనని, ఓటర్లను ప్రలోభపెట్టే వ్యూహంగా బీజేపీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. 'ఇదొక రకమైన విన్యాసం. మొదట పుల్వామా దాడిని చూపించారు. ఇప్పుడు రాముడి ఫోటోను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. రెండుసార్లు మోసపోయాం, మూడోసారి కూడా మోసపోకూడదని కోరుకుంటున్నట్టు ' మంత్రి అభిప్రాయపడ్డారు. రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ఏదోక రూపంలో విరాళం అందించారు. శ్రీరాముడు అందరికీ పూజనీయుడు, ఇందులో బేధాభిప్రాయాలు వద్దని సుధాకర్ సూచించారు. ఆధ్యాత్మికత ముసుగులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story