30 ఏళ్లుగా ఒక్క చీర కొనలేదు.. ఎందుకంటే? రాజ్యసభ మహిళా MP షాకింగ్ కామెంట్స్

by Anjali |
30 ఏళ్లుగా ఒక్క చీర కొనలేదు.. ఎందుకంటే? రాజ్యసభ మహిళా MP షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు షాపింగ్ చేయడానికి ఎంత ప్రిపరెన్స్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక ఐటెమ్ కొనడానికి వెళ్తారు.. కానీ అక్కడికి వెళ్లాక, మహిళల కళ్లకు ఏం కనిపించినా పాపమే.. షాప్‌లో ఏం అట్రాక్ట్‌గా కనిపించినా కొనేస్తుంటారు. విపరీతంగా మనీ ఖర్చు పెట్టేస్తుంటారు. గంటల తరబడి షాప్‌లో సమయాన్ని గడిపేస్తుంటారు. ఆడాళ్లతో షాపింగ్ కు వెళ్లిన తమ బ్రదర్ గానీ, ఫాదర్ గానీ, హాస్బెండ్‌ కు గానీ తెగ చికాకు తెప్పిస్తుంటారు. షాపింగ్ అంటే అంత పడిచచ్చిపోతారు మరీ మహిళలు. అయితే మామూలుగా ఎవరైనా సరే సంవత్సరానికి కనీసం 4, 5 చీరలైన కొంటారు కదా..? కానీ రాజ్యసభ ఎంపీ , ప్రముఖ రచయిత్రి, సామాజిక సేవలో గుర్తింపు దక్కించుకున్న గొప్ప వ్యక్తి సుధా మూర్తి షాపింగ్ చేసేవాళ్లు షాక్ అయ్యేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె గత 30 ఏళ్ల నుంచి ఒక్క శారీ కూడా కొనలేదని చెప్పి జనాలందర్ని షాకింగ్ కు గురి చేసింది. తనకు ఉన్న చీరల్లోనే మళ్లీ మళ్లీ అవే కట్టకుంటానని వెల్లడించింది. అయితే ఒకప్పుడు సుధామూర్తికి షాపింగ్ అంటే చాలా ఇష్టముండేదట. కానీ ఆమె కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి.. మనకు ఇష్టమైనవి వదిలేస్తే అంతా శుభం జరుగుతుందని పెద్దలు చెప్తే నమ్మిందట. దీంతో ఆమెకు ఇష్టమైన షాపింగ్‌ను వదిలేసిందట. తన అమ్మకు ఎనిమిది నుంచి పది చీరలు ఉండేవని చెప్పుకొచ్చింది. తన బామ్మకు కేవలం నాలుగు చీరలు మాత్రమే ఉండేవని.. వారిలా పొదుపుగా జీవించాలనుకున్నానని తెలిపారు. తమ అక్కా చెల్లెళ్లు, ఫ్రెండ్స్ ఎవరైనా చీరలను గిఫ్ట్స్ గా ఇస్తే వాటినే సౌకర్యవంతంగా కట్టుకుంటానని వెల్లడించారు.

Advertisement

Next Story