- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రామజన్మభూమి’ ఓట్ల కోసం వాడే రాజకీయ అంశం కాదు : రాజ్‌నాథ్
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రామజన్మభూమి అనేది రాజకీయ అంశం కానే కాదని.. అది సాంస్కృతిక అంశమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్లను రాల్చే రాజకీయ అంశంగా దాన్ని బీజేపీ పరిగణించడం లేదని స్పష్టం చేశారు. అసోంలోని తేజ్‌పూర్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాత భారత్‌కు, కొత్త భారత్‌కు మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసం ఆలోచనా విధానమేనని ఆయన చెప్పారు. నేటి యువత కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడు మన దేశంలో 1 లక్షకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ యూనికార్న్‌లు ఉన్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లోనూ స్టార్టప్‌ల ద్వారా మేం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘‘భారతదేశం ఇకపై ‘లెట్ ఇట్ బి’ అనే విధానాన్ని అనుసరించదు.. ప్రధాని మోడీ నాయకత్వంలో కొత్త భారతదేశం ‘లెట్స్ డూ’ అప్రోచ్‌తో పురోగమిస్తోంది’’ అని ఆయన తెలిపారు.