సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ హోలీ వేడుకలు..ఆర్మీ చీఫ్‌కు కీలక సూచన

by samatah |
సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ హోలీ వేడుకలు..ఆర్మీ చీఫ్‌కు కీలక సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లేహ్‌లో సైనికులతో కలసి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ జవాన్లతో కలిసి మెలసి మాట్లాడారు. హోలీ పండుగ జరుపుకునేందుకు సైనికులు లేహ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘సియాచిన్‌ సాధారణ భూమి కాదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారం, సంకల్పానికి తిరుగులేని చిహ్నం’ అని కొనియాడారు. ఈ ప్రాంతం జాతీయ నిర్ణయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. సాయుధ బలగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఏదైనా పండుగ వచ్చినప్పుడల్లా, సరిహద్దుల్లో మోహరించిన సాయుధ బలగాలతో ముందు రోజు వేడుకల్లో పాల్గొనడం ద్వారా కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేకు సూచించారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తమ లక్ష్యమని వెల్లడించారు. సరిహద్దుల్లో బలగాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ఎన్ని బెదిరింపులు చేసినా భారత్ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. అయితే మొదట రాజ్ నాథ్ సింగ్ సియాచిన్‌ను సందర్శించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ ప్రోగ్రామ్ రద్దు చేశారు. వీలైనంత త్వరగా మరోసారి సందర్శిస్తానని తెలిపారు.

Advertisement

Next Story