Diwali : సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..చైనా బార్డర్‌లో రక్షణ మంత్రి, అండమాన్‌లో సీడీఎస్

by Hajipasha |   ( Updated:2024-10-30 13:02:48.0  )
Diwali : సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..చైనా బార్డర్‌లో రక్షణ మంత్రి, అండమాన్‌లో సీడీఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో : వెలుగుల పండుగ ‘దీపావళి’ని మనదేశ సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకునే గొప్ప సంప్రదాయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైంది. దీన్ని కొనసాగిస్తూ గురువారం రోజు సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకునేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) , కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, త్రివిధ దళాల అధిపతులు(defence chiefs) రెడీ అయ్యారు. ఇందుకోసం మంత్రులు రాజ్‌నాథ్, కిరణ్ రిజిజు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఏఎస్), జనరల్ ఉపేంద్ర ద్వివేది కలిసి బుధవారం ఉదయాన్నే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు చేరుకున్నారు.

తవాంగ్ ప్రాంతం చైనా సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులతో కలిసి దీపావళి(Diwali) వేడుకల్లో రాజ్‌నాథ్, కిరణ్ రిజిజు పాల్గొననున్నారు. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లోని భారత సైనికులతో కలిసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), జనరల్ అనిల్ చౌహాన్ దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారత నౌకాదళ సిబ్బందితో కలిసి నేవీ చీఫ్, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి.. జమ్మూ కశ్మీరులోని సైనికులతో కలిసి భారత వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ దీపావళి వేడుకలలో పాల్గొంటారు. ఈ ఏడాది దీపావళి వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

Advertisement

Next Story