Rajasthan CM: రాజస్థాన్ సీఎంను చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్.. ఏమైందంటే..?

by Hajipasha |
Rajasthan CM: రాజస్థాన్ సీఎంను చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్.. ఏమైందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లో కలకలం రేగింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు దౌసా జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూంకు ఆదివారం ఉదయం ఫోన్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఫోన్ నంబర్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా.. దౌసా జిల్లాలోని శ్యాలావాస్ సెంట్రల్ జైలు కనిపించింది. దీంతో ఆ జైలులో హుటాహుటిన తనిఖీలు నిర్వహించిన పోలీసులు, జైలు సిబ్బంది.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడు కాల్ చేసేందుకు వినియోగించిన ఫోన్‌తో పాటు మరో తొమ్మిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు దౌసా ఏఎస్పీ లాల్సోత్ లోకేశ్ సోన్‌వాల్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన నిందితుడి పేరును ఇప్పుడే బయటపెట్టలేమని ఏఎస్పీ స్పష్టం చేశారు. సదరు నిందితుడు బెంగాల్‌లోని డార్జిలింగ్ వాస్తవ్యుడని.. ప్రస్తుతం అతడు శ్యాలావాస్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని చెప్పారు.

Advertisement

Next Story