ముంబైలో MLA Raja Singh రోడ్ షో.. భారీగా తరలివచ్చిన జనం

by Mahesh |   ( Updated:2024-02-29 14:07:18.0  )
ముంబైలో MLA  Raja Singh రోడ్ షో.. భారీగా తరలివచ్చిన జనం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఎమ్మెల్యే రాజాసింగ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హిందువుల, గోమాత రక్షణ కోసం నిత్య కృషి చేసే ఆయన తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. అలాగే హిందుమతం మీద, ఎక్కడ దాడులు జరిగిన తనదైన శైలిలో స్పందిస్తుంటారు రాజాసింగ్. ఇటీవల అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ని పురస్కరించుకుని.. ముంబైలోని మీరా రోడ్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ ర్యాలీపై ఓ వర్గానికి చెందిన అల్లరి మూకలు దాడులు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన రాజాసింగ్ తాను మీరా రోడ్డుకు త్వరలోనే వస్తానని అప్పటిలోగా అంతా సెట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోన అక్కడి ప్రభుత్వం కూడా.. అల్లరి మూకలకు చెందిన అక్రమకట్టడాలను తొలగించడంతో పాటు ఆ ప్రాంతాన్ని కాలీ చేయించారు. ఈ రోజు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఈ రోజు మీరా రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు హిందూ సంఘం నేతలు హాజరయ్యారు. ఎవరు ఊహించని రేంజ్ లో జనం రావడంతో రాజాసింగ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సనాతన ధర్మానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీరా రోడ్, ముంబై యువతకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని తెలిపారు.

Advertisement

Next Story