Raj thackray: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ..ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే

by vinod kumar |
Raj thackray: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ..ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే వెల్లడించారు. 200 నుంచి 250 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. గురువారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంతలను పూడ్చడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ గందర గోళంగా ఉన్నాయని, ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని స్పష్టం చేశారు. తన పార్టీలోని ఫిరాయింపుల ఊహాగానాలపై కూడా థాక్రే స్పందించారు. పార్టీలోని కొందరు వ్యక్తులు ఇతర పార్టీల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారని, వారి ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని తెలిపారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ రాష్ట్రంలోని మహాయుతి కూటమి పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed