- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకో పైలట్ల మితిమీరిన వేగంపై రైల్వే బోర్డు కమిటీ ఏర్పాటు
దిశ, నేషనల్ బ్యూరో: లోకో పైలట్ల మితిమీరిన వేగంపై రైల్వే బోర్డు కమిటీని వేసింది. రైల్వే డ్రైవర్లు తరచుగా వేగ పరిమితిని ఉల్లంఘిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీని వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే దీనికోసం రైల్వేశాఖ ప్రత్యేక కమిటీని వేసింది. ఇటీవలి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ చర్య తీసుకుందని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. వేగపరిమితులకు సంబంధించిన ఆపరేషన్ నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందో లేదో అనే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల ఇద్దరు డ్రైవర్లు వేగపరిమితిని ఉల్లంఘించారు. 20 కిలోమీటర్ల వేగానికి బదులు 120 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఈ ఘటనలు జరిగిన వెంటనే రైల్వే బోర్డు జూన్ 3న అన్ని జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 5 న జరిగిన సమావేశంలో ప్రతి డివిజన్ నుంచి లోకో పైలట్‌లు హాజరయ్యారు. 180 మందికి పైగా లోకో పైలట్లు, లోకో ఇన్‌స్పెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. వేగ నియంత్రణలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు సహా రైల్వే వేగ పరిమితులపై వారి నుంచి సూచనలు స్వీకరించింది. దాన్ని బట్టే నిబంధనలు సవరించాలో లేదో నిర్ణయించనుంది.