స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోడీకి రాహుల్ స్పెషల్ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోడీకి రాహుల్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో నివాసం ఉంటోన్న మణిపూర్ ప్రజలతో రాహుల్ సమావేశం అయ్యారు. అనంతరం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా మోడీని రాహుల్ రిక్వెస్ట్ చేశారు. తాము ఢిల్లీలో నివాసం ఉంటున్నామని తెలిసి ప్రతీకారం తీర్చుకుంటారని.. దయచేసి తమ ముఖాలను చూపొద్దని రాహుల్‌తో మణిపూర్ బాధితులు చెప్పుకున్నట్లు నెట్టింట్లో పేర్కొన్నారు. దీంతో వారు చేతులు కలిపిన ఫొటోను ట్విట్టర్‌లో రాహుల్ షేర్ చేశారు. గత కొన్ని నెలల క్రితం స్థానికంగా ఉన్నటువంటి జాతుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా వందలాది మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనలేదని వెల్లడించారు. ‘‘మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, నిజమైన స్వాతంత్ర్యం అంతుచిక్కని మణిపూర్ దుస్థితిని మనం ఆలోచించుకుందాం. మణిపూర్‌లో మరోసారి పర్యటించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేసేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ఆకట్టుకోవాలని నేను మరోసారి ప్రధానిని కోరుతున్నాను.’’ అని రాహుల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed