- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ కేసు మే 2కు వాయిదా
అహ్మదాబాద్: పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మోడీ ఇంటి పేరుతో ఉన్న వారంతా ‘దొంగలు’ అని ఆరోపించిన రాహుల్ వ్యాఖ్యలు ‘తీవ్రమైన నేరం’ కిందికి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే.. ఇది సివిల్ వివాదమని, ఈ కేసుతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
గతంలో ఇలాంటి ఆరోపణల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను న్యాయమూర్తి ముందుంచారు. రాహుల్ వ్యాఖ్యలు ఎవరినీ రెచ్చగొట్టేలా లేవని, ఆయన పేర్కొన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా తదితరులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధిగా రాహుల్ ప్రకటనలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత కేసును మంగళవారానికి వాయిదా వేశారు.