Breaking: రాష్ట్రపతికి రాహుల్ గాంధీ లేఖ.. దేనిగురించంటే..?

by Indraja |
Breaking: రాష్ట్రపతికి రాహుల్ గాంధీ లేఖ.. దేనిగురించంటే..?
X

దిశ డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు తాజాగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ (X) అకౌంట్ ద్వారా తెలియచేసారు. 2019-2022 మధ్యకాలంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే మూడు సాయుధ దళాల్లో సేవలు అందించేందుకు అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి.. యువకులు మరియు మహిళలు కఠినమైన మానసిక మరియు శారీరక పరీక్షలు మరియు వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

భారత సాయుధ దళాల్లో సేవలు అందించేందుకు సంసిద్ధమై జాయినింగ్ లెటర్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత ప్రభుత్వం చేదు వార్తను చెప్పిందని తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను ముగించి అగ్నిపథ్ స్కీమ్ తో భర్తీ చేయాలనే భారత ప్రభుత్వం నిర్ణయంతో యువత కన్న కలలు చెదిరిపోయాయని లేఖ ద్వారా ఆవేధన వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ పథకం చాల సమస్యలకు కారణం అవుతుందని.. సామాజిక స్థిరత్వాన్ని ప్రభావితం ప్రభావితం చేసేందుకు కూడా అవకాశం ఉందని..అలానే మన జవాన్ల మధ్య వివక్షకు ఇది దారితీస్తోందని.. కనుక దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక ఆ లేఖను పోస్ట్ చేస్తూ దానికి దేశభక్తి, ధైర్యసాహసాలు కలిగిన సైనిక అభ్యర్థులకు న్యాయం జరిగేలా వారు చేస్తున్న పోరాటంలో మేం వారి వెంట ఉన్నాం అనే క్యాప్షన్ ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed