Rahul Gandhi: వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. రాహుల్‌గాంధీ రియాక్షన్ ఇదే!

by Shiva |   ( Updated:2024-07-30 04:50:32.0  )
Rahul Gandhi: వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. రాహుల్‌గాంధీ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని వాయనాడ్‌లో ముండకై, మెప్పాడి, చురల్‌మల ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు, వంతెనలు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించింది. వాయనాడ్ ఘటనపై విపక్ష నేత నేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండ చరియలు విరిగి పడ్డాయనే వార్త విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలో కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను కేరళ సీఎం పినరయ్ విజయన్‌‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేశానని పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం చూసుకోవాలని, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించనట్లుగా రాహుల్ గాంధీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed