- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి మరణం ముందే తెలుసు: రాహుల్ గాంధీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ముగిసిన భారత్ జోడో యాత్ర తనకు తపస్సు లాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తన జీవితంలో కుటుంబం, పిల్లలు ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ జోడో యాత్ర, భారత దేశ రాజకీయాలు, తన కుటుంబ సభ్యుల గురించిన పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్ర దేశంలోని పరిస్థితులు తనకు బోధపడేలా చేసిందని అన్నారు. దేశంలో హిందువులు, ముస్లింల మధ్య పోలరైజేషన్‌ను రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే ఇది మీడియా చిత్రీకరిస్తున్నంత భయంకరమైన పరిస్థితి లేదని.. పేదరికం, ద్రవ్యోల్బణం వంటి మరింత తీవ్రమైన సమస్యల నుండి ప్రజలను మళ్లించడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగించబడుతోందని చెప్పారు.
దేశంలో ఫాసిజం ఇప్పటికీ ఉందన్న రాహుల్.. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోతున్నాయన్నారు. పార్లమెంట్ పని చేయడం లేదని ఆరోపించారు. విపక్షాలు ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించగలమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీతో సహా తన కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకున్నాడు.
తన నాయనమ్మ అంటే తనకు చాలా ఇష్టమని రాహుల్ గాంధీ వెల్లడించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీకి తన మరణం గురించి ముందుగానే తెలుసని అన్నారు. శక్తుల ఏకాగ్రత తన ప్రాణాలను బలిగొంటుందని తన తండ్రి భావించాడని చెప్పుకొచ్చారు. తాను మాత్రం ప్రాణాలకు భయపడనని.. తాను చేయవలసింది చేస్తాన్నారు.
52 ఏళ్ల వయసులో తాను వివాహం చేసుకోకుండా ఎందుకు ఒంటరిగా ఉన్నాడో చెప్పలేదు. అయితే తనకు పిల్లలు ఉండటాన్ని ఇష్టపడతానని చెప్పారు. కాగా భారత్ జోడో యాత్ర సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కాబోయే భార్యపై స్పందించిన రాహుల్ గాంధీ ప్రేమించే వ్యక్తి, ఇంటెలిజెంట్ అయితే చాలు వివాహానికి అభ్యంతరం లేదంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.