‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర ముగించిన రాహుల్

by Hajipasha |   ( Updated:2024-03-16 18:57:33.0  )
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను శనివారం సాయంత్రం ముగించారు. 6,700 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ యాత్రను ముంబైలోని దాదర్‌ వద్ద ఆయన ఆపేశారు. రాహుల్ యాత్ర ధారావి ప్రాంతం వద్దకు చేరుకోగానే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అక్కడికి చేరుకున్నారు. నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం ‘చైత్యభూమి’ వద్ద రాహుల్, ప్రియాంక, స్థానిక కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. యాత్రను విజయవంతంగా నిర్వహించినందుకు రాహుల్‌కు ఈసందర్భంగా ప్రియాంక అభినందనలు తెలిపారు. రాహుల్ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వైఫ్యలాలతో ముడిపడిన వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు రాహుల్ ఈ యాత్ర చేశారు. ప్రజలను చైతన్యవంతులుగా మార్చేందుకు ఈ యాత్రను నిర్వహించారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈడీ, సీబీఐలతో దేశంలోని కంపెనీలను టార్చర్ చేయించి.. వాటితో బలవంతంగా ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ కొనుగోలు చేయించిందని ఆయన ఆరోపించారు. ఇలా అక్రమంగా ఆర్జించిన డబ్బుతోనే మహారాష్ట్ర, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని విమర్శించారు. రాహుల్ యాత్ర చివరి రోజునకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ యాత్రను ముగించారనే వివరాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ యాత్రను మార్చి 17న ముగియాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఒకరోజు ముందే ముగించాల్సి వచ్చిందన్నారు.

Advertisement

Next Story