Rahul Gandhi : ట్రంప్ ల్యాండ్ మార్క్ విక్టరీ.. రాహుల్ గాంధీ స్పెషల్ విషెస్

by Sathputhe Rajesh |
Rahul Gandhi : ట్రంప్ ల్యాండ్ మార్క్ విక్టరీ.. రాహుల్ గాంధీ స్పెషల్ విషెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ నాయకత్వంలో ఆసక్తి ఉన్న రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. యూఎస్ 47వ అధక్ష్యుడిగా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు.. ప్రజలు మీ విజన్‌పై పూర్తి విశ్వాసం ఉంచారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు రెండు దేశాల చారిత్రాత్మక స్నేహం కొనసాగుతుందన్నారు. భారతీయులు, అమెరికన్లకు అవకాశాలు కల్పించడంలో కలిసి పనిచేద్దామని గురువారం ట్రంప్‌నకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ కోరారు.

Advertisement

Next Story